బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కూతురు సారా అలీ ఖాన్ ఇటు సినిమాలు అటు సోషల్ మీడియాతో తెగ సందడి చేస్తుంది. బాలీవుడ్ యంగ్ హీరోయిన్స్‌కి గట్టి పోటీ ఇస్తున్న సారా ప్రస్తుతం అక్షయ్ కుమార్, ధనుష్ మల్టీ స్టారర్ గా రూపొందిన ‘అత్రంగీ రే’ సినిమాలో కథానాయికగా నటిస్తుంది.
‘కేదార్ నాథ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సారా తొలి సినిమాతోనే మంచి విజయం సొంతం చేసుకున్నారు. తర్వాత వచ్చిన సింబా కూడా సూపర్ హిట్ అయింది. హిట్ సినిమాలు, సారా అందం ఆమెకు మరింత పాపులారిటీ తెచ్చి పెట్టింది. సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన హాట్ ఫోటో లను పోస్ట్ చేస్తూ మరింత క్రేజ్ సంపాదించుకుంది ఈ భామ.
తాజాగా క్లీవేజ్ షో ఫొటోలను షేర్ చేసింది సారా అలీ ఖాన్. ఈ అమ్మడిలోని గ్లామర్ యాంగిల్‌ని చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం సారా ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాగా, సారా చిన్నప్పుడు చాలా బొద్దుగా ఉండేది. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక స్లిమ్‌గా మారి అభిమానుల మనసులు గెలచుకుంటుంది.