‘నా కెరీర్ ఓ మ్యాజిక్‌లా అనిపిస్తుంది. ఒకటి తర్వాత ఒకటి అనుకోని వరాలే నన్ను వరించాయి’ అంటూ తన కెరీర్‌ని మననం చేసుకున్నది పాలబుగ్గల వయ్యారి సారా అర్జున్. ‘ఊహ తెలిసిన నాటినుంచీ మణిరత్నంసార్ సినిమాలంటే ఇష్టం. ఆయన దర్శకత్వంలో నటించాలని కలలు కనేదాన్ని. ఆ కల ‘పొన్నియిన్ సెల్వన్’తో నెరవేరింది. ఆ తర్వాత నటనలో మెళకువలు నేర్చుకునేందుకు విదేశాలని వెళ్లాలనుకున్నాను. అంతలోని ‘యుఫోరియా’ అవకాశం వరించింది. ప్రస్తుత సమాజానికి అవసరమైన అరుదైన కథ కావడంతో అంగీకరించా. దీని షూటింగ్ టైమ్‌లోనే ‘ధురంధర్’కు సైన్ చేశాను. ‘ధురంధర్’ విజయం నా కెరీర్‌నే సమూలంగా మార్చేసింది. ఆ సినిమా చూసి అమ్మానాన్న భావోద్వేగానికి లోనయ్యారు. వారి ఎమోషన్ చూసి నాకు కన్నీళ్లొచ్చాయి. ఇలా అనుకోకుండా ఆశలన్నీ నెరవేరడం మ్యాజిక్ కాక మరేంటి?’ అన్నారు సారా అర్జున్.