Sara Ali Khan | ప్రముఖ బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ (Sara Ali Khan) మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో (Indore) ఉన్న ఖజ్రానా గణేశ్ టెంపుల్లో (Khajrana Ganesh temple) వినాయకుడిని దర్శించుకున్నారు. గణేశుడికి ప్రత్యేక పూజలు చేసి గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. పూజకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా సోమ్య (Somya) ఇండోర్‌కు వచ్చిందని రాసుకొచ్చారు.
సారా అలీఖాన్, విక్కీ కౌశల్ (Vicky Kaushal) జంటగా నటించిన రొమాంటిక్ కామెడి చిత్రం ‘జరా హట్కే జరా బచ్చే’ (Zara Hatke ZaraBachke) విజయవంతంగా ప్రదర్శితమవుతున్నది. శనివారం నాటికి 23 రోజులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం మొత్తంగా రూ.80 కోట్లు రాబట్టింది. శనివారం ఒక్కరోజే రూ.2 కోట్లు వసూలుచేసింది. ఈ సినిమాలో సారా అలీఖాన్ క్యారెక్టర్ పేరు సోమ్య. అందుకే ఇండోర్‌లో సోమ్య అంటూ ఆలయంలో ఉన్న ఫొటోలను తన ఇన్‌స్టాలో పోస్ట్చేసింది.