Saptami Gowda | కన్నడ ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా వివాదాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఇటీవలే ఓ హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ వివాదం కొనసాగుతుండగానే.. మరో హాట్ న్యూస్ తెరపైకి వచ్చింది. కాంతార ఫేం సప్తమి గౌడ (Saptami Gowda) కన్నడ నటుడు యువ రాజ్‌కుమార్ మాజీ భార్య శ్రీదేవిపై పరువు నష్టం దావా వేసింది.
వివరాల్లోకి వెళితే.. కన్నడ హీరో శివరాజ్‌కుమార్ సోదరుడి కుమారుడు యువ రాజ్‌కుమార్ యువ సినిమాతో డెబ్యూ ఇచ్చాడు. ఈ సినిమాలో సప్తమి గౌడ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. యువ రాజ్‌కుమార్ తన భార్య శ్రీదేవి (Sridevi)కి విడాకులివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే శ్రీదేవి చాలా ఇంటర్వ్యూల్లో తన విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ సప్తమి గౌడ వల్లే తనకిలా జరిగిందంటూ చెప్పుకొచ్చింది. సప్తమి గౌడ, తన భర్త అఫైర్ వల్ల తమ పెండ్లి పెటాకులైందంటూ వాపోయింది శ్రీదేవి .
శ్రీదేవి తనపై పదే పదే దాడి చేస్తుండటంతో.. సప్తమి గౌడ తాజాగా రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేసింది. తనకు నష్టపరిహారం చెల్లించడంతోపాటు ప్రజల ముందు క్షమాపణలు చెప్పాలని శ్రీదేవిని డిమాండ్ చేస్తోంది సప్తమి గౌడ. ఈ వివాదం రాబోయే రోజుల్లో ఏ స్థాయికి వెళ్తుందనేది చూడాలి మరి.
Sridevi