బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం దంగల్‌లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన భామ సన్యా మల్హోత్రా. చిత్రంలో అమీర్ ఖాన్ రెండో కూతురిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దంగల్ చిత్రం తర్వాత ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వస్తాయని అందరు ఊహించారు. కాని చెప్పుకోదగ్గ అవకాశాలు అందుకోలేకపోతుంది. రీసెంట్గా ఈ అమ్మడు నటించిన ‘మీనాక్షి సుందరేశ్వర్’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై విజయాన్ని అందుకుంది.
తాజాగా ఆంగ్ల పత్రికకు సన్యా ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆ ఇంటర్వ్యూలో బ్రేకప్ విషయాన్ని వెల్లడించింది. ఢిల్లీలో ఉన్నప్పుడు ఒక వ్యక్తితో ప్రేమలో పడ్డాను.. నాలుగేళ్ళ రిలేషన్ తరువాత బ్రేకప్ అయ్యింది.. దాని తరువాత నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. ఈ బ్రేకప్ ఎంతో బాధని ఇస్తుంది.. విడిపోవడం కన్నా ఎక్కువ బాధ ఏది ఉండదు. అయితే మనల్ని కాదనుకున్న వారి గురించి ఆలోచించడం వేస్ట్. అందుకే నేను ఇప్పుడు నా ఆరోగ్యం, కెరీర్‌పై ఫోకస్ పెట్టానని చెప్పింది.
2020 నాకు మంచి సంవత్సరం, రిలాక్సేషన్ దొరికింది. ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ కంటే ముఖ్యమైనది కాదనే సత్యాన్ని గ్రహించాను అంటూ చెప్పుకొచ్చింది దంగల్ బ్యూటీ. ప్రస్తుతం అమ్మడి బ్రేకప్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు ఈ అమ్మడు ఎవరి ప్రేమలో పడిందనే విషయం మాత్రం వెల్లడించలేదు.