Santosh Shobhan Latest Movie Update | ఫలితంతో సంబంధంలేకుండా వరుస సినిమాలతో ఎంటర్టైన్ చేస్తుంటాడు సంతోష్ శోభన్. మొదటి నుండి ఈయన కొత్త దనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ప్రతి సినిమాకు వేరియేషన్ చూపిస్తూ టాలీవుడ్లో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘గోల్కొండ హై స్కూల్’తో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ప్రారంభించిన సంతోష్ శోభన్.. ‘పేపర్‌బాయ్’తో హీరోగా పరిచయమయ్యాడు. కరోనా సమయంలో వచ్చిన ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో మెదటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈయన నాలుగు ప్రాజెక్ట్‌లను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఒకటి. మేర్లపాక గాంధి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది. పోస్టర్లతోనే సినిమాపై క్యూరియాసిటీని క్రియేట్ చేశారు. తాజాగా మేకర్స్ టీజర్ డేట్‌ను ప్రకటించారు. ఈ మూవీ టీజర్ సోమవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. అడ్వేంచర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సంతోష్‌కు జోడీగా జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుంది. సుదర్శన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైనమెంట్స్, అమృతా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రవీణ్ లక్కరాజు, రామ్ మిర్యాల సంగీతం అందిస్తున్నారు.
Repu Vasthunaru #LSS gang 🙌
Meeku istharu Ultimate fun bang🤟TEASER OUT TOMORROW @ 4:05 PM ❤️🔥
Note: Repu Teaser ala ragane ila
LIKE👍SHARE🔁 & SUBSCRIBE🔔
cheseyandi🕺💃@santoshshobhan @fariaabdullah2 @MerlapakaG @vboyanapalli @actorbrahmaji @NiharikaEnt #AamukthaCreations pic.twitter.com/Ilbr1lRpkv— Niharika Entertainment (@NiharikaEnt) September 18, 2022
Read Also:
SSMB29 | మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్లుగా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలు?
Shankar | శంకర్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యష్?
Kabza Movie | ఆసక్తి రేకెత్తిస్తున్న ‘కబ్జా’ టీజర్.. ‘కేజీఎఫ్’ను మించేలా ఉందిగా..!
Varun Tej | ఎయిర్‌ఫోర్స్ ఆఫీసర్‌గా వరుణ్ తేజ్.. ఆసక్తి రేకిత్తిస్తున్న ‘VT13’ స్పెషల్ వీడియో