1970 నేపథ్య కథ
సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. సుస్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదలకానుంది.
సంతోష్ శోభన్, గౌరి జి. కిషన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకుడు. సుస్మిత కొణిదెల, విష్ణుప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ నెల 18న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం జరిగిన సమావేశంలో సుస్మిత కొణిదెల మాట్లాడుతూ ‘నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రమిది. చిన్న ఆలోచనతో ఈ సినిమాను మొదలుపెట్టాం. టీమ్ అంతా కష్టపడి పనిచేశాం. గ్రామీణ నేపథ్య కథలో సంతోష్‌శోభన్ అద్భుతంగా నటించాడు. ఆహ్లాదభరిత ప్రేమకథా చిత్రంగా అందరిని మెప్పిస్తుంది’ అన్నారు. 1970 నేపథ్యంలో అందంగా సాగే ప్రేమకథా చిత్రమిదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతినందిస్తుందని సంతోష్ శోభన్ తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ సినిమా చూసిన తర్వాత మన కుటుంబ సభ్యులందరిని కలుసుకుంటే బాగుండనిపిస్తుంది. ప్రతి పాత్ర సహజంగా ఉంటుంది. మరచిపోతున్న అనుబంధాల్ని గుర్తుకు తెచ్చే చక్కటి చిత్రమిది’ అన్నారు. తెలుగులో తనకిది తొలి చిత్రమని, గ్రామీణ కథలో నటించడం ఆనందంగా ఉందని కథానాయిక గౌరి జి కిషన్ తెలిపింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

