‘మా చిత్రానికి విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి స్పందన లభిస్తున్నది. వచ్చే ఆదివారం వరకు ఏడుకోట్లు వసూలు చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం’ అన్నారు నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి. ఆయన నిర్మాతగా నిర్వి హరిప్రసాద్ రెడ్డితో కలిసి నిర్మించిన ‘సంతానప్రాప్తిరస్తు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. విక్రాంత్, చాందిని చౌదరి జంటగా నటించిన ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకుడు.
ఈ సందర్భంగా ఇటీవల సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమా విషయంలో తమ అంచనాలు నిజమయ్యాయని, ఇన్ఫెర్టిలిటీ అనే కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు పాజిటివ్‌గా అర్థం చేసుకున్నారని అన్నారు. మధుర శ్రీధర్ రెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించానని, తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా విజయాన్ని అందుకోవడం ఆనందంగా ఉందని నిర్వి హరిప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.