కర్ణాటక రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన పీరియాడికల్ చిత్రం ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేష ఠాకూర్ జంటగా నటించారు. శేషు పెద్దిరెడ్డి దర్శకుడు. డాక్టర్ యిర్రంకి సురేష్ నిర్మాత. ఇటీవల ఈ చిత్రంలోని రెండు పాటలను ఇటీవల పాత్రికేయులకు ప్రదర్శించారు.
దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ కథను ముందుగా కేఎస్ రామారావుకు చెప్పాను. ఆయనకు బాగా నచ్చింది. ఆయన సలహాలతో సినిమాను తెరకెక్కించాను’ అన్నారు. కేఎస్ రామారావు మాట్లాడుతూ ‘ చాలా కాలం తరువాత వస్తున్న అందమైన చిన్న సినిమా ఇది. మ్యూజిక్, కంటెంట్, విజువల్స్ చాలా బాగుంటాయి. ఆరు భాషల్లో ఈ సినిమాను నిర్మించారు’ అన్నారు.