Aishwarya Rai Bachchan | చిత్రపరిశ్రమకు సంబంధించిన వేడుకలు అంటే చాలు చూడటానికి రెండు కళ్లూ చాలవు. వేడుకలో భాగంగా తారలు ధరించే దుస్తులు, వారు వేసుకునే నగలపైనే అందరి చూపూ ఉంటుంది. ఇక స్టార్ హీరోయిన్, మాజీ ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యరాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan ) ఫ్యాషన్ (Fashion) లుక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినీ వేడుకలోనైనా, ఫ్యాషన్ షోలోనైనా ఐష్ విభిన్న కాస్ట్యూమ్స్‌తో అలరిస్తుంటుంది. ఇక ఏటా ఫ్రాన్స్ వేదికగా జరిగే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival)కు కొత్త కళ తెస్తుంటుంది ఐశ్వర్య. ఆమె రెడ్ కార్పెట్‌పై అలా నడుచుకూంటూ వస్తుంటే కెమెరా కళ్లన్నీ ఐష్ (Aish)వైపే ఉంటాయి. ఈ ఏడాది కూడా కేన్స్‌లో ఐశ్వర్య సందడి చేస్తోంది.
CANNES QUEEN 🤍✨#AishwaryaRai #AishwaryaRaiBachchan #CannesFilmFestival2025 pic.twitter.com/ZQ1seF0Hqr
— Vivek singh (@VivekSi24403998) May 23, 2025
నిన్న తెలుపు రంగు చీర, టిష్యూ డ్రేప్, మెడలో ముత్యాల హారాలు, మెరిసే సిందూరం.. ఇలా సంప్రదాయబద్దంగా కేన్స్‌లో రెడ్ కార్పెట్‌పై సందడి చేసిన ఐష్.. రెండోరోజూ ప్రత్యేకత చాటుకుంది. సంస్కృత శ్లోకాలతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన డ్రెస్‌ను ధరించిన ఫొటోలకు ఫోజులిచ్చింది. తన డ్రెస్‌పై భగవద్గీత (Bhagvad Gita) శ్లోకం రాసి ఉంది. సిల్వర్ కలర్ బనారసీ బ్రోకెడ్ కేప్పై ‘భగవద్గీత’లోని ‘కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన’ అనే శ్లోకాన్ని చేతితో సంస్కృతంలో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ప్రముఖ డిజైనర్ గౌరవ్ గుప్తా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఈ మేరకు ఐశ్వర్య ఫొటోలను కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ఐశ్వర్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. భగవద్గీత గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు అంటూ ప్రశంసిస్తున్నారు.
Aishwarya Rai Bachchan at the Cannes Film Festival 2025 ✨🖤🤍/1#AishwaryaRai #AishwaryaRaiBachchan pic.twitter.com/oM2BO2Elkh
— WV – Media (@wvmediaa) May 22, 2025
Also Read..
Aishwarya Rai | తొలిసారి బాడీ షేమింగ్ విమర్శలపై స్పందించిన ఐశ్వర్యరాయ్
Covid-19 | మరో బాలీవుడ్ నటికి కరోనా పాజిటివ్
Suhasini | ఎట్టకేలకి తమ లవ్ సీక్రెట్ బయటపెట్టిన సుహాసిని.. ఆ సినిమా చూసి మణి గొంతు కోశా