Suhasini | అలనాటి అందాల నటి సుహసిని అంటే తెలుగు ప్రేక్షకులకి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పలు భాషలలో సినిమాలు చేసిన ఆమెకి స్టార్డం ఇచ్చింది మాత్రం తెలుగు ప్రేక్షకులే. అయితే ఆమె మణిరత్నంని వివాహం చేసుకొని చెన్నై వెళ్లింది. అప్పటి నుండి తెలుగు సినిమాలకి దూరం అయింది. ఆ మధ్య కొన్ని తెలుగు సినిమాలలో సపోర్టింగ్ పాత్రలలో కనిపించి మెప్పించారు. చాలా రోజుల తర్వాత సుహాసిని హైదరాబాద్ వచ్చారు. తన భర్త మణిరత్నం తీసిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్ కోసం ఇక్కడికి వచ్చారు. ఈవెంట్లో సుహాసిని మాట్లాడుతూ.. ఇక్కడికి వస్తే తన పుట్టింటికి వచ్చినట్టు అనిపిస్తుందని పేర్కొంది.
ఇక్కడి నుంచి తప్పిపోయి మణిరత్నంను పెళ్లి చేసుకుని చెన్నైకి వెళ్లిపోయాను కాని, లేదంటే ఇక్కడే ఉండేదాన్ని అంటూ సుహాసిని చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు నాకు నా ఫేవరేట్ సాంగ్.. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు గుర్తొస్తుంది. ఇలాంటి రోజు మళ్లీ రాదు.. ఇలాంటి టీం మళ్లీ మళ్లీ కలిసి పని చేయదు.. ఇలాంటి గొప్ప సినిమా మళ్లీ మళ్లీ రాదు.. ఇంత వరకు టీంలోని ఏ మెంబర్ కూడా పూర్తి సినిమా చూసి ఉండరు. చివరకు మా బాబాయ్ కమల్ గారు కూడా పూర్తి సినిమాను చూసి ఉండరు. కానీ నాకు ఆ అదృష్టం దక్కింది. 80 శాతం సినిమా చూశాను. అదిరిపోయింది. అద్భుతంగా వచ్చిందని సుహాసిని పేర్కొంది.
ఇక మణిరత్నం గారు తీసిన నాయగన్ (తెలుగులో నాయకుడు) సినిమా అంటే నాకు చాలా ఇష్టం. ఈ సినిమా చేయక ముందు ఆయన ఎవరో కూడా నాకు తెలీదు.. పెళ్లి కూడా కాలేదు.. నాయగన్ సినిమా చూసిన తరువాత వెంటనే మణిరత్నంకు ఫోన్ చేసి ఓ పదిహేను నిమిషాలు మాట్లాడాను, ఆయన గొంతు కోసేసాను అని సరదాగా చెప్పుకొచ్చారు. అసలు పరిచయం లేని వ్యక్తికి ఎందుకు అలా ఫోన్ చేశాను.. ఎందుకు అలా పది హేను నిమిషాలు మాట్లాడాను అన్నది నాకు కూడా అర్ధం కాలేదు. ఒక వేళ నాయగన్ సినిమా లేకపోయి ఉంటే.. ఈ మణిరత్నం లైఫ్లో సుహాసిని ఉండేది కాదేమో అని నవ్వుతూ చెప్పింది. మణిరత్నం కెరీర్లోనే కాకుండా.. కమల్ కెరీర్లోనూ తనకు ఎంతో ఇష్టమైన సినిమా నాయగన్ అని మళ్లీ ఇన్నేళ్లకు ఈ ఇద్దరి కాంబో వస్తుండటం ఆనందంగా ఉందని,సుహాసిని తెలిపింది. జూన్ 5న థగ్ లైఫ్ ప్రేక్షకుల ముందుకు రానుంది.