టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)-త్రివిక్రమ్ శ్రీనివాస్ (Mahesh Trivikram film) కాంబినేషన్లో ఇప్పటికే అతడు, ఖలేజా చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కలయికలో మరో సినిమాకు ప్లాన్ జరుగుతుందని ఇప్పటికే అప్ డేట్స్ తెరపైకి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో నటించబోతున్నాడని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. తాజాగా దీనికి సంబంధించిన వార్త ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. సంజయ్ దత్ ఈ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలో కనిపిస్తాడనేదానిపై ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది.
అవినీతి రాజకీయ వేత్తగా కనిపించబోతున్నాడట సంజయ్ దత్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కేజీఎఫ్ 2 చిత్రంతో తొలిసారి దక్షిణాది ప్రేక్షకులను పలుకరించబోతున్నాడు మున్నాభాయ్. మహేశ్ సినిమాలో సంజయ్ దత్ నటించే న్యూస్ పక్కా అయితే ఈ ప్రాజెక్టు హాట్ కేక్‌గా మారడం ఖాయమైనట్టే. మరి ఈ వార్తలపై సంజయ్ దత్ ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నట్టు ఇన్సైడ్ టాక్.
మహేశ్‌బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చేస్తున్నాడు. ఈ మూవీలో కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. గత కొన్నేళ్లలో భారత్‌లో సెన్సేషన్ సృష్టించిన బ్యాంకు మోసాలు, ఆర్థిక నేరాల నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్టు టాలీవుడ్ సర్కిల్ టాక్.
ఇవి కూడా చదవండి..
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్