ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హారర్ కామెడీ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. ఇందులో ప్రభాస్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్ ఈ సినిమాలో ప్రభాస్ తాతగా కీలకమైన పాత్రలో నటించబోతున్నారని తెలిసింది.
కథాపరంగా ఈ చిత్రంలో తాత, నానమ్మ పాత్రలకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, తాత క్యారెక్టర్లో సంజయ్‌దత్ కనిపిస్తారని చెబుతున్నారు. కథ నచ్చడంతో సినిమాకు సంజయ్‌దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ప్రభాస్ శైలి యాక్షన్, మారుతి తరహా వినోదంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఈ సినిమాతో పాటు ‘ప్రాజెక్ట్-కె’ ‘సలార్’ చిత్రాల్లో నటిస్తున్నారు.