Sanjay Dutt | దక్షిణాది చిత్రాల్లో తనదైన విలక్షణ నటనతో ప్రతినాయకుడి పాత్రల్లో రాణిస్తున్నారు బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్‌దత్. ‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో ఆయన పండించిన విలనీ అందరిని ఆకట్టుకుంది. ప్రస్తుతం సంజయ్‌దత్ ‘లియో’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. దళపతి విజయ్ కథానాయకుడిగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. మాఫియా నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
శనివారం సంజయ్‌దత్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలో ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలో సంజయ్‌దత్ ఆంటోనిదాస్ అనే పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. దీనితో పాటు రామ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రంలో సంజయ్‌దత్ బిగ్ బుల్ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు.