Sanghavi | ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన అందాల తార సంఘవి. ఈ అమ్మడు తన అందచందాలతో పాటు నటనతోను ప్రేక్షకుల మనసులని కొల్లగొట్టింది. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ చిన్నది పదిహేను ఏళ్ల కెరియర్లో 80కి పైగా సినిమాలలో నటించి ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టింది. 1993లో ‘కొక్కరోకో’ అనే తెలుగు చిత్రంతో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఈ సినిమా తర్వాత తాజ్ మహల్, ఊరికి మొనగాడు, తాత మనవడు, నాయుడు గారి కుటుంబం, సరదా బుల్లోడు, సూర్య వంశం, అబ్బాయి గారి పెళ్లి, సమర సింహారెడ్డి, సింధూరం, సీతారామ రాజు, పిల్ల నచ్చింది, చిరంజీవులు, లాహిరి లాహిరి లాహిరి లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.
ఇక పెళ్లి అనంతరం సినీరంగానికి గుడ్ బై చెప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గిపోవడంతో 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత చివరిగా 2019లో కొలంజి అనే తమిళ చిత్రంలో నటించింది సంఘవి. అయితే ఈ అమ్మడు సినిమా ఇండస్ట్రీకి దూరమైన అడపాదడపా బుల్లితెరపై కనిపిస్తూ సందడి చేసేది. జబర్దస్త్ సహా పలు టీవీ షోలలో తళుక్కున మెరిసింది. ఇక సినిమా ఈవెంట్స్లోను అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. భర్త, కూతురి ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది.
పెళ్లయ్యాక చాలా ఏళ్ల వరకు సంఘవికి సంతానం కలగలేదు. 2020లో పండంటి ఆడబిడ్డకి జన్మనిచ్చింది సంఘవి. అప్పటికీ సంఘవి వయస్సు 42 ఏళ్లు . ఇక కూతురిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న సంఘవి ఆ పాపకి ఛాన్వీ అని పేరు పెట్టుకుంది. అప్పుడప్పుడు సంఘవి ఫొటోలతో పాటు ఆమె ఫ్యామిలీ, కూతురు ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సంఘవి కూతురిని చూసిన ఆమె అభిమానులు ఎంత క్యూట్ గా ఉందని కామెంట్స్ చేస్తుంటారు. అయితే సంఘవి సినిమాలలో కనిపించకుండా సోషల్ మీడియాలోనే ట్రెండ్ అవుతూ అభిమానులని అలరిస్తూ ఉంటుంది.