Rakasa | తెలుగు సినీ పరిశ్రమలో లేడీ దర్శకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. బి. జయ తర్వాత దర్శకురాలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న పేరు మానస శర్మ. వెబ్ సిరీస్‌లతో మంచి గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు ‘రాకాస’ సినిమాతో థియేటర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాకాస చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో, నిహారిక కొణిదెల నిర్మిస్తున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరో నిర్మాతగా ఉమేష్ కుమార్ బన్సాల్ వ్యవహరిస్తున్నారు. హీరోగా సంగీత్ శోభన్, హీరోయిన్గా నయన్ సారిక నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదల కానుంది.
గత కొద్ది రోజులుగా చిత్ర బృందం ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఈవెంట్‌కి వెళ్లింది చిత్ర బృందం. లేడి డైరెక్టర్ పక్కన నిలుచొని ఉన్న సంగీత్ అనుమతి లేకుండానే ఆమె చున్నీతో తన కళ్లద్దాలు తుడుచుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే మానస శర్మ మంచిది కాబట్టి పర్మీషన్ అడగకపోయిన ఏమలేదు, వేరే వాళ్లయితే గట్టిగా ఇచ్చి పడేసేవారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ఇక మానస శర్మ కెరీర్ శ్రీకాకుళంలో ప్రారంభమైంది. యూట్యూబ్‌లో చేసిన ‘మ్యాడ్ హౌస్’ షార్ట్ ఫిల్మ్ ఆమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. అనంతరం ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వెబ్ సిరీస్‌కు క్రియేటర్, రైటర్‌గా పని చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌తో సక్సెస్ అందుకుంది.
‘రాకాస’ కథను మొదట వెబ్ సిరీస్‌గా తెరకెక్కించాలని భావించారట. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ నుంచి ఆఫర్ వచ్చినప్పటికీ, హీరో సంగీత్ శోభన్ ఎంట్రీతో ఈ ప్రాజెక్ట్‌ను ఫీచర్ ఫిల్మ్‌గా మార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన కథను కేవలం 15 నిమిషాల్లో వినగానే నిహారిక కొణిదెల నిర్మాణానికి ముందుకు వచ్చారని మానస శర్మ వెల్లడించింది. బడ్జెట్ పెరిగినా, క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా నిహారిక పూర్తి సపోర్ట్ ఇచ్చిందని ఆమె తెలిపింది. ‘రాకాస’ ఒక ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ మిక్స్‌తో రూపొందిన ఎంటర్టైనర్. ఈ సినిమా థియేటర్లో చూడాల్సిన అనుభూతిని ఇస్తుందని దర్శకురాలు నమ్మకంగా చెబుతోంది. హర్రర్, కామెడీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని చిత్రబృందం భావిస్తోంది.