Sandeep | తనదైన గ్రేస్ ఫుల్ డ్యాన్స్, మూమెంట్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్. ఆట అనే రియాలిటీ షో విన్నర్‌గా నిలిచి ఆట సందీప్‌గా మారిన ఇతను బిగ్ బాస్ షోలో కూడా సందడి చేశాడు. ఏడో సీజన్లో ఎంట్రీ ఇచ్చి స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర అభిమానులను ఎంతగానో అలరించాడు. బిగ్ బాస్ షోతో మనోడికి మంచి క్రేజ్ వచ్చింది. ఇక సందీప్ భార్య జ్యోతి రాజ్ మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి అప్పుడప్పుడు పలు సాంగ్స్‌కి రీల్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు.
ఇక సందీప్, జ్యోతి రాజ్‌లు ఏ విషయాన్నైన ముక్కుసూటిగానే మాట్లాడతారు. జానీ మాస్టర్ ఇష్యూ విషయంలో వీరిద్దరు స్పందిస్తూ ఆయన గురించి మాకు బాగా తెలుసు. ఎక్కడో తేడా కొట్టిందని అన్నారు. ఇక తాజాగా సందీప్ భార్య జ్యోతి రాజ్ ఆడవాళ్ల వ్యవహార శైలి ఎలా ఉంది? ప్రస్తుతం అమ్మాయిలు ఎలా ఉన్నారు? అనే దానిపై ఓ వీడియో వదిలింది. ఈ వీడియోలో జ్యోతి మాట్లాడుతూ ఈ రోజుల్లో కొంత మంది మాత్రమే మంచి అమ్మాయిలు ఉన్నారు. 90 శాతం మంది అమ్మాయిలు బద్మాషుల్లా ఉన్నారని తెలిపింది.70 శాతం మంది మగాళ్లు అమాయకులే కాగా, వారికి ఎమోషన్స్ ఉండవా? అమ్మాయిలకు మాత్రమే ఎమోషన్స్ ఉంటాయా? వాళ్లకు ఫీలింగ్ ఉండవా? అని నిలదీసింది.
చేసేదంతా అమ్మాయిలు చేసేస్తున్నారని, వేయాల్సి వేషాలన్నీ వేస్తున్నారని చివరకు మళ్లీ ఉమెన్ కార్డ్ తీస్తూ సింపతీ కార్డ్ ప్లే చేస్తున్నారని కౌంటర్లు వేసింది. ఇప్పటికైన మగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని అందరికీ సూచించింది జ్యోతి రాజ్. అయితే ఈ వీడియో జానీ మాస్టర్ని ఉద్దేశించి పెట్టిందా, లేకుంటే ఇటీవల తనకి జరిగిన ఏ విషయంలో అయిన అప్సెట్ అయి పెట్టిందా అనేది తెలియదు. ఇక సందీప్, జ్యోతి కలిసి చేసే డ్యాన్స్ వీడియోలు, రీల్స్ వీడియోలు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎక్కడ వల్గారిటీ లేకుండా ట్రెడిషనల్ లుక్‌లో రీల్స్ చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇక అప్పుడప్పుడు మంచి పనులు చేస్తూ ఉంటారు. ఆ మధ్య హైదరాబాద్‌లో పుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారికి స్వయంగా దుప్పట్లు కొని అందించారు. . ఇలాంటి సహాయ కార్యక్రమాలు మరిన్ని చేపడతామని ఆ సందర్భంగా జ్యోతి రాజ్ తెలిపారు.