విభిన్న పాత్రల్లో రాణిస్తూ నటుడిగా సత్తా చాటుతున్నారు చైతన్య రావు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ దియా’. ‘ఏ నేక్డ్ ట్రూత్’ ట్యాగ్‌లైన్. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్ణ నాయుడు నిర్మాత. శనివారం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా విడుదల చేశారు. నేటి ట్రెండ్‌కు తగిన కథాంశమిదని, మానన సంబంధాల తీవ్రతను ఆవిష్కరిస్తూ.. ప్రేమ, మోహం, వైఫల్యం, సంఘర్షణ ప్రధానాంశాలుగా బలమైన భావోద్వేగాలతో సాగుతుందని మేకర్స్ తెలిపారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో హీరో చైతన్యరావు శరీరంపై ఎలాంటి దుస్తులు లేకుండా సోఫాలో కూర్చొని కనిపిస్తున్నారు. ఆధునిక సంబంధాలను నిజాయితీగా, ఎలాంటి హిపోక్రసీ లేకుండా చూపించబోతున్నామని, వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు పేర్కొన్నారు. ఇరా, సఖి, జెస్సీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీజీ విందా, సంగీతం: ఫణి కల్యాణ్, నిర్మాణ సంస్థ: శ్రియాస్ చిత్రాస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కె.క్రాంతిమాధవ్.