అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం సందీప్ రెడ్డి వంగా నిర్మాతగా తెలంగాణ నేపథ్యంలో ఓ ప్రేమకథా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. తెలంగాణ సంస్కృతి, స్థానిక అంశాలకు ప్రాధాన్యతనిస్తూ సాగే ఈ ప్రేమకథా చిత్రానికి ‘రొమాంచికం’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం.
ఇందులో సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటిస్తారని, ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్తుందని చెబుతున్నారు. ఈ చిత్రం ద్వారా వేణు దర్శకుడిగా పరిచయం కానున్నారని తెలిసింది. పూర్తి తెలంగాణ యాస భాషలతో రూటెడ్ మూవీగా తెరకెక్కనుందని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.