Spirit | ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో రాజాసాబ్, ఫౌజీ చిత్రీకరణ దశలో ఉంటే.. స్క్రిప్ట్ దశలో ‘కల్కి’ సెకండ్ పార్ట్ ఉంది.ఈ మూడు సినిమాలూ ఒకెత్తు అయితే.. సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ ఒకెత్తు. ప్రస్తుతం ‘స్పిరిట్’ ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. ప్రభాస్ సినిమాలన్నీ అభిమానులకు సమానమే.. ‘స్పిరిట్’ కాస్త ఎక్కువ సమానం అన్నట్టుగా ఉంది ప్రజెంట్ సిట్యువేషన్. సందీప్ రెడ్డి ైస్టెల్ హీరోగా ప్రభాస్‌ని ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
తాజాగా ‘స్పిరిట్’కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగుచూసింది. ఇందులో విలన్స్‌గా స్టార్ కపుల్స్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్లను సందీప్‌రెడ్డి ఎంచుకున్నారట. సైఫ్, కరీనా ఇందులో క్రూయల్ వైఫ్ అండ్ హస్బెండ్‌గా కనిపిస్తారట. ఇటీవలే ఈ జంటను కలిసి కథను, కేరక్టర్లను వివరించారట సందీప్. వారికి ఈ పాత్రలు బాగా నచ్చాయని, చేయడానికి ఉత్సాహం చూపించారని బీటౌన్ సమాచారం. ఇక ఇందులో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. ఈ పాత్రతో పాటు మరో వైవిధ్యమైన పాత్రలో కూడా ప్రభాస్ కనిపించనున్నారని బాలీవుడ్ సమాచారం. ఇందులో నిజానిజాలు తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.