Ramam Raghavam | కోలీవుడ్ దర్శకుడు, నటుడు సముద్రఖని(Samutrakhani) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘రామం రాఘవం'(Ramam Raghavam). ఈ సినిమాతో టాలీవుడ్ నటుడు ధనరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణలో పృథ్వి పొలవరపు నిర్మిస్తున్నాడు. నేడు అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇక ఈ ఫస్ట్ లుక్ను 22 మంది సినీ ప్రముఖులు విడుదల చేయడం విశేషం.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ గమనిస్తే.. తండ్రి కొడుకులుగా సముద్రఖని , ధనరాజ్ డైనమిక్ గా కనిపిస్తున్నారు. ఇంటెన్స్ తో కూడిన పోస్టర్ కు విశేష స్పందన లభిస్తోంది. ఇదివరకు ఎప్పుడూ చూడని ఒక తండ్రి కొడుకుల కథను అద్భుతంగా తెరమీద ఆవిష్కరిస్తున్నామని దర్శకుడు ధనరాజ్ కొరనాని తెలిపారు.. ఈ సినిమాలో మోక్ష, హరీష్ ఉత్తమన్, సత్య పృద్వి, శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, ప్రమోదిని, రాకెట్ రాఘవ, రచ్చ రవి, ఇంటూరి వాసు, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి విమానం చిత్ర దర్శకుడు శివ ప్రసాద్ యానాల కథ ను సమకూర్చగా అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్నాడు, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్. దుర్గా ప్రసాద్ ఈ సినిమాకు కెమెరామెన్. హైదరాబాద్, చెన్నై, అమలాపురం, రాజమండ్రి, రాజోలు, పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘రామం రాఘవం’తమిళ తెలుగు భాషలలో ఒకేసారి విడుదల కానుంది.
Wishing all the very best to the entire team 🤗 https://t.co/d26htIriVt
— deva katta (@devakatta) January 22, 2024