మణిరత్నం (Mani Ratnam) దర్శకత్వంలో సీక్వెల్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న భారీ మల్టీస్టారర్ పొన్నియన్ సెల్వన్-2 (Ponniyin Selvan-2). ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ చెన్నైలో మూవీ ఆడియో, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ గ్రాండ్‌గా కొనసాగుతోంది. ఈవెంట్లో తారలంతా సినిమా థీమ్‌కు అనుగుణంగా ఏర్పాటు చేసిన సింహాసనంపై కూర్చొని సందడి చేశారు.
సముద్రకుమారి (Samuthirakumari)గా నటిస్తోన్న ఐశ్వర్య లక్ష్మి సిల్వర్ కలర్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ ఈవెంట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మరోవైపు జయం రవి, శోభితా ధూళిపాళ, త్రిష కూడా సింహాసనంపై కూర్చొని మెస్మరైజ్ చేస్తున్నారు. ఈవెంట్‌కు కమల్‌హాసన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఇప్పుడీ వీడియోలు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
పొన్నియన్ సెల్వన్ -2 ప్రాజెక్ట్‌లో చియాన్ విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, శోభితా ధూళిపాళ, పార్థీబన్, ప్రకాశ్‌రాజ్, నాజర్, శరత్‌కుమార్‌తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే స్టోరీతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పార్టు -1లాగే పొన్నియన్ సెల్వన్-2 కూడా ఐమాక్స్ ఫార్మాట్లో విడుదల కానుంది.
ఈవెంట్లో సముద్రకుమారి..
She conquered the seas, now she is here to conquer your hearts. Our Samuthirakumari #AishwaryaLekshmi #PonniyinSelvan2 #PS2 #PS2Trailer #PS2AudioLaunch #CholasAreBack#ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial @tipsmusicsouth pic.twitter.com/kaGsfIYmSv
— Lyca Productions (@LycaProductions) March 29, 2023
With his gracious smile and charm, our #PonniyinSelvan @actor_jayamravi is at the #PS2AudioLaunch#CholasAreBack#PS2 #PonniyinSelvan2 #PS2Trailer #ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @Tipsofficial pic.twitter.com/SzYDP3DmMt
— Lyca Productions (@LycaProductions) March 29, 2023
An embodiment of royalty even off-screen @trishtrashers #PonniyinSelvan2 #PS2 #PS2Trailer #PS2AudioLaunch #CholasAreBack#ManiRatnam @arrahman @madrastalkies_ @LycaProductions @RedGiantMovies_ @Tipsofficial @tipsmusicsouth pic.twitter.com/xPMieohVKn
— Lyca Productions (@LycaProductions) March 29, 2023
Read Also :
Ravi Kishan | రేసుగుర్రం విలన్నూ వదలని కాస్టింగ్ కౌచ్.. హాట్ టాపిక్‌గా రవికిషన్ కామెంట్స్
Narayana & Co Teaser | ఎంటర్టైనింగ్గా సుధాకర్ కోమాకుల నారాయణ అండ్ కో టీజర్
Ponniyin Selvan-2 | పొన్నియన్ సెల్వన్ -2 ఈవెంట్‌కు మరో స్టార్ హీరో..?