Kannappa | మంచు ఫ్యామిలీ నుంచి వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కన్నప్ప (Kannappa). దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నిర్మిస్తుండగా.. మంచు విష్ణు (Manchu Vishnu) కథానాయకుడిగా నటిస్తున్నాడు. హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ అగ్ర తారలు నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మహాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ (Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ మూవీని డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక్కొక్క క్యారెక్టర్‌ను చిత్రయూనిట్ విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళ నటుడు శరత్ కుమార్ నాథనాధుడు (Nathanadhudu) అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించిన కన్నప్ప టీం ఆ తర్వాత సినీయర్ నటి మధుబాల ‘పన్నగ’ (Pannaga) అనే చెంచుల దొరసాని పాత్రలో కనిపించబోతుందని..
తెలుగు సినీయర్ నటుడు దేవరాజ్ ‘ముండడు’ (Mundadu) అనే ఎరుకల దొర(Erukala Dora) పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పుడు తాజాగా మరో పాత్రను విడుదల చేసింది కన్నప్ప టీం. ఈ సినిమాలో నటుడు సంపత్ రామ్ భిల్లు జాతి దొర చండుడు అనే పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. అడవినే భయభ్రాంతుల్ని చేసే భీకర జాతి. నల్ల కనుమ నేలలో పుట్టారు. మొసళ్ళ మడుగు నీరు తాగి పెరిగారు. భిల్ల జాతి అధినేత చండుడు. రాతి గొడ్డళ్లే వీరి ఆయుధం. శత్రువుల రక్తంతోనే అభిషేకం అంటూ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
#Sampath on board as #Chandudu, the #Bhillulu clan chief #SampathRam #Kannappa🏹 #HarHarMahadevॐ pic.twitter.com/zvUqxn6JKm
— Vamsi Kaka (@vamsikaka) August 12, 2024
Also Read..