Samantha | టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha )కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎలాంటి సినీ నేపథ్యం లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి తక్కువ సమయంలోనే స్టార్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకుంది. సమంత నటి మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా. మిడిల్‌క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన సామ్‌కు పేదల కష్టాలు చాలా బాగా తెలుసు. అందుకే సమంత పలు సేవాకార్యక్రమాల ద్వారా పేదలకు సాయం చేస్తుంటుంది. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించి పెద్ద మనసు చాటుకుంది.
ఈ క్రమంలోనే సమంత మానవత్వానికి ఫిదా అయిన ఓ వ్యక్తి.. ఏకంగా సమంతకి గుడి కట్టేశాడు. ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh) రాష్ట్రంలోని బాపట్ల (Bapatla) జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ (Sandeep)అనే యువకుడు సమంతకి వీరాభిమాని. ఆమె నటనతో పాటు తన సేవా కార్యక్రమాలకు ఫిదా అయిన అతడు.. సమంతపై అభిమానం పెరిగి ఆమెకు గుర్తిండిపోయే గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడువుగా సమంతకు ఏకంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. తన ఇంటి ప్రాంగణంలోనే ఆలయం కోసం స్థలం కేటాయించి విగ్రహాన్ని కూడా తయారు చేయించాడు. ప్రస్తుతం విగ్రహానికి, ఆలయానికి తుది మెరుగులు దిద్దే పనిలో పడ్డారు. రేపు (ఏప్రిల్ 28) వ తేదీన సమంత పుట్టిన రోజు సందర్భంగా ఈ గుడిని ప్రారంభించనున్నట్లు సందీప్ తెలిపారు.
Also Read..
Harsh Goenka | పానీపూరీ Vs భూమి.. ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన హర్ష గోయెంకా
AR Rahman | భార్యను హిందీలో కాకుండా తమిళ్లో మాట్లాడాలన్న రెహమాన్.. నెటిజన్ల ఫైర్
Amit Shah | అమిత్‌షాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్