AR Rahman | భార్యను హిందీలో కాకుండా తమిళ్లో మాట్లాడాలన్న రెహమాన్.. నెటిజన్ల ఫైర్
AR Rahman | ఏఆర్ రెహమాన్ (AR Rahman).. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు ఆయన. అయితే, రెహమాన్‌కు తమిళ (Tamil) భాషపై మక్కువ ఎక్కువ. ముస్లిమ్‌గా కన్వర్ట్ అయిన రెహమాన్.. బయట తమిళ్ మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
AR Rahman | ఏఆర్ రెహమాన్ (AR Rahman).. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. దాదాపు మూడు దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలుతున్నారు ఆయన. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో వేల పాటలకు ఆయన ప్రాణం పోశారు. రెహమాన్ ఏదైనా సినిమాకు మ్యూజిక్ (Music) చేయడానికి ఒప్పుకున్నాడు అంటే.. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిందే. అంతలా రెహమాన్ మ్యూజిక్కు జనాలు కనెక్ట్ అయ్యారు. రెండు ఆస్కార్ (Oscar)అవార్డులను అందుకొన్న తొలి భారతీయుడుగా రెహమాన్ రికార్డులకెక్కారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయన సంగీతం ఏ స్థాయిలో ఉంటుందో.
అయితే, రెహమాన్‌కు తమిళ (Tamil) భాషపై మక్కువ ఎక్కువ. ముస్లిమ్‌గా కన్వర్ట్ అయిన రెహమాన్.. బయట తమిళ్ మాట్లాడటానికే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. తమిళ భాషపై తనకున్న ప్రేమను అనేకసార్లు వెల్లబుచ్చారు కూడా. తాజాగా మరోసారి తమిళం మీద తనకున్న అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసి నెటిజన్ల చేత ట్రోల్‌కు గురయ్యారు.
ఇటీవల తమిళనాడులో ఓ అవార్డుల వేడుక జరిగింది. ఈ వేడుకకు రెహమాన్ తన భార్య సైరాభాను (Saira Banu) తో కలిసి హాజరయ్యారు. వేదికపై తన భార్యతో కలిసి అవార్డు కూడా అందుకున్నారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడారు. ఆ తర్వాత సైరాభానును కూడా మాట్లాడాలని నిర్వాహకులు కోరారు. దీంతో ఆమె మాట్లాడటానికి రెడీ అవుతుండగా.. రెహమాన్ కల్పించుకుని హిందీ (Hindi)లో కాకుండా తమిళ్ (Tamil)లో మాట్లాడాలని ఆమెకు సూచించారు. అందుకు సైరాభాను స్పందిస్తూ.. ‘నాకు తమిళం అంతగా మాట్లాడేందుకు రాదు’ అంటూ ఇంగ్లీష్‌లో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ముఖ్యంగా రెహమాన్ చేసిన పనికి మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ‘హిందీ భాషలోనే పాటలు పాడి సంపాదిస్తున్నావ్.. తమిళంలో మాట్లాడమని చెబుతావా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఏ భాషలో మాట్లాడాలనేది వారి వ్యక్తిగత అంశం. భారతదేశంలో అన్ని భాషలు సమానమే’, ‘తమిళ్ మీద మీకు అభిమానం ఉండొచ్చు.. కాని మీ భార్య ఏ భాషలో మాట్లాడాలి అన్నది కూడా మీరే డిసైడ్ చేయడం మంచి పద్దతి కాదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘హిందీ సినిమాలు, హిందీ ప్రేక్షకుల సపోర్ట్‌తో ఎదిగిన మీకు.. ఈ రోజు హిందీ పనికిరాకుండా పోయిందా..?’ అంటూ ప్రశ్నిస్తున్నారు.
கேப்புல பெர்பாமென்ஸ் பண்ணிடாப்ள பெரிய பாய்
ஹிந்தில பேசாதீங்க தமிழ்ல பேசுங்க ப்ளீஸ் 😁 pic.twitter.com/Mji93XjjID
— Black cat (@Cat__offi) April 25, 2023
Also Read..
Amit Shah | అమిత్‌షాపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్
Chrisann Pereira | డ్రగ్స్ కేసులో అరెస్ట్.. షార్జా జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి
Angry Tiger | పార్క్‌లో టూరిస్ట్‌లపైకి దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- ar rahman
- Hindi
- saira banu
- tamil
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

