Chrisann Pereira | డ్రగ్స్ కేసులో అరెస్ట్.. షార్జా జైలు నుంచి విడుదలైన బాలీవుడ్ నటి
Chrisann Pereira | మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో (drug smuggling case) అరెస్టైన బాలీవుడ్ నటి (Bollywood actress) క్రిసాన్ పెరీరా (Chrisann Pereira ) యూఏఈలోని షార్జా జైలు (Sharjah jail) నుంచి తాజాగా విడుదలైంది.
Chrisann Pereira | మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో (drug smuggling case) అరెస్టైన బాలీవుడ్ నటి (Bollywood actress) క్రిసాన్ పెరీరా (Chrisann Pereira ) యూఏఈలోని షార్జా జైలు (Sharjah jail) నుంచి తాజాగా విడుదలైంది. ఆమె దగ్గరున్న ట్రోఫీలో డ్రగ్స్‌ను గుర్తించిన షార్జా పోలీసులు ఈ నెల మొదట్లో నటిని విమానాశ్రయంలో అరెస్ట్ చేసి జైలుకు పంపారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే తమ కుమార్తెను డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొందరు ఇరికించారంటూ నటి కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నటిని నిర్దోషిగా తేల్చి జైలు నుంచి విడుదల చేశారు.
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటి క్రిసాన్ పెరీరాను ఇద్దరు వ్యక్తులు ఇరికించినట్టు పోలీసులు (Police) గుర్తించారు. ఆ ఇద్దరు నిందితుల్ని ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు (mumbai crime branch police) అరెస్ట్ చేశారు. పెరీరాను జైలుకు పంపేందుకు ఉద్దేశపూర్వకంగా వారు ఆమె తీసుకెళ్తున్న ట్రోఫీలో డ్రగ్స్ పెట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల్లో ఒకరిని ముంబైలోని బొరివలీ (Borivali )కి చెందిన ఆంథోనీ పాల్ (Anthony Paul) కాగా, మరొకరిని మహారాష్ట్రలోని సింధుదుర్గ్ (Maharashtra Sindhudurg)కు చెందిన రాజేశ్ బాభోటే అలియాస్ రవి (Rajesh Babhote alias Ravi)గా గుర్తించారు.
నటి తల్లిపై ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగానే ఆంథోనీ పాల్ తన సహచరుడు రవితో కలిసి క్రిసాన్ పెరీరాను ఈ కేసులో ఇరికించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులో భాగంగా ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ కోసం యూఏఈలో ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ ఆంథోనీ పాల్ ఆమెను అక్కడికి పంపారు. విమానాశ్రయానికి వెళ్లిన తర్వాత డ్రగ్స్‌తో నింపిన ట్రోఫీని ఆమెకు అందించారు. అంతేకాదు, పాల్ ఇలాగే మరో నలుగురిని కూడా ఇరికించినట్టు ముంబై పోలీసులు గుర్తించారు. కాగా, 27 ఏండ్ల క్రిసాన్ పెరీరా (Chrisann Pereira ) ‘సడక్ 2’, ‘బాట్లా హౌస్’ వంటి బాలీవుడ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది.
Also Read..
Rahul Gandhi | రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
India Corona | 9 వేలకు పైనే కొత్త కేసులు.. 60 వేల దిగువకు యాక్టివ్ కేసులు
Angry Tiger | పార్క్‌లో టూరిస్ట్‌లపైకి దూసుకొచ్చిన పులి.. వీడియో వైరల్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

