Angry Tiger | పార్క్‌లో సరదాగా సఫారీకి (Safari Ride) వెళ్లిన కొందరు టూరిస్ట్‌లకు (Tourists) భయంకరమైన అనుభవం ఎదురైంది. వారు ప్రయాణిస్తున్న సఫారీ వాహనంపైకి ఓ పులి (Tiger) దాడి చేయబోయింది. దీంతో వారు ఒక్కసారిగా భయంతో వణికిపోయారు. ప్రాణభయంతో వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (Jim Corbett National Park)లో చోటు చేసుకుంది.
కొందరు పర్యాటకులు (Tourists) పార్క్‌లో సఫారీకి (Safari Ride) వెళ్లారు. అక్కడ ఉన్న వన్యప్రాణుల్ని ఎంతో ఆసక్తిగా తిలకిస్తూ.. వాటిని తమ కెమెరాల్లో బంధిస్తున్నారు. ఆ సమయంలో ఓ చోట పొదల్లో వారికి పెద్ద పులి (Tiger) కనిపించింది. దీంతో సఫారీ జీప్ డ్రైవర్ కాసేపు వాహనాన్ని అక్కడే నిలిపివేయడంతో.. పర్యాటకులు పులిని ఫొటోలు, వీడియోలు తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఆ సమయంలో పులి ఒక్కసారిగా బిగ్గరగా గాండ్రిస్తూ సఫారీ జీపు వైపు దూసుకొచ్చింది. దీంతో పర్యాటకులు భయంతో కేకలు వేశారు. అప్రమత్తమైన డ్రైవర్ వాహనాన్ని వెంటనే అక్కడి నుంచి ముందుకు పోనిచ్చారు. దీంతో పులి అక్కడి నుంచి వెనుదిరిగింది. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న ఓ పర్యాటకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అదికాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Striped monk gets irritated 😣
What will you do if at every designated hours people crash into your house as their matter of right? pic.twitter.com/4RDCVLWiRR— Susanta Nanda (@susantananda3) April 26, 2023
Also Read..
India Corona | 9 వేలకు పైనే కొత్త కేసులు.. 60 వేల దిగువకు యాక్టివ్ కేసులు
Rahul Gandhi | రాహుల్ గాంధీ పరువు నష్టం కేసు విచారణ నుంచి తప్పుకున్న జడ్జి
KTR | పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్