Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు రెండో వివాహం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా వీరి ప్రేమాయణంకి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్చల్ చేస్తుండగా,ఎట్టకేలకి సమంత వీటికి పులిస్టాప్ పెట్టింది. డిసెంబర్ 1న సమంత తన ప్రియుడు రాజ్‌ని వివాహం చేసుకొని పెళ్లికి సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఇవి నెట్టింట వైరల్ అయ్యాయి. ఇక సమంత స్నేహితురాలు శిల్పా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటోలు కూడా ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. షేర్ చేసిన వెంటనే ఈ ఫొటోలు వేల సంఖ్యలో లైక్స్, షేర్స్‌ను రాబట్టాయి. వైరల్ అవుతున్న ఫోటోలలో, సమంత–రాజ్ ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ చిరునవ్వులు పంచుకుంటున్న దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరో ఫోటోలో సమంత, రాజ్ వైపు ప్రేమగా చూస్తూ ఉండగా, ఆ ఎమోషనల్ మూమెంట్ నెటిజన్లను ఆకట్టుకుంది. వీరి కెమిస్ట్రీ చూస్తే ఆదర్శ జంటలా ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
శిల్పా రెడ్డి షేర్ చేసిన మరో ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది సమంత–రాజ్ వివాహ భోజనం. మెనూలో దాల్, వెజిటేబుల్ ఫ్రై, వడ మరియు ఇతర సౌత్ ఇండియన్ ఇంటి వంటకాలు మాత్రమే ఉన్నాయి. చాలా సింపుల్‌గా ఉన్న ప్లేట్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భోజనం చాలా సాదాసీదాగా, ఇంటి స్టైల్లో ఉండటంతో.. అభిమానులు, నెటిజన్లు సమంతపై ప్రశంసలు కురిపిస్తున్నారు . అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, పెళ్లి భోజనాన్ని కూడా ఇంత సింపుల్‌గా, సాంప్రదాయబద్ధంగా ప్లాన్ చేయడం సమంత వ్యక్తిత్వానికి నిదర్శనం అని కామెంట్ చేస్తున్నారు. ఆమె పెళ్లి భోజనం.. ఆమె వ్యక్తిత్వంలా సింపుల్‌గా.. ప్యూర్‌గా ఉందంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.కాగా, సమంత–రాజ్ పరిచయం 2021లో ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సమయంలో మొదలైంది. మొదట స్నేహంగా ఉన్న ఈ బంధం, కాలక్రమేణా ప్రేమగా మారింది.
మొన్నటి వరకు వీరిద్దరూ తమ రిలేషన్‌ను చాలా ప్రైవేట్‌గా ఉంచారు. సెప్టెంబర్‌లో సమంత షేర్ చేసిన ‘లవ్’ పోస్టుతో అభిమానుల్లో సందేహాలు పెరిగినప్పటికీ, ఇప్పుడు ఈ పెళ్లితో ఆ ఊహాగానాలకు ముగింపు పలికారు. ఈశా ఆశ్రమంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక వివాహం తర్వాత, సమంత ఎప్పుడు మీడియా ముందుకు వస్తుందా?, ఏదైనా సందేశం ఇస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అంతవరకు ఈ ఇన్సైడ్ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి.