పెళ్లి తర్వాత వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరిస్తున్న సమంత కన్నడలో సూపర్ హిట్ అయిన ‘యూటర్న్’ మూవీని అదే పేరుతో తెలుగు, తమిళ భాషల్లో సినిమా చేశారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతల్ని తీసుకున్నారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవిచంద్రన్, భూమిక కీలకపాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్, వివై కంబైన్స్ బ్యానర్లపై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారులు సంయుక్తంగా నిర్మించారు.
రాంగ్ రూట్లో ‘యూ టర్న్’ తీసుకుని ప్రయాణం చేయడం వల్ల ఏర్పడే ముప్పును సస్పెన్స్ థ్రిల్లర్‌గా సామజిక బాధ్యతను గుర్తుచేస్తూ.. ‘యూటర్న్’ మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని సమంత. ఈ సినిమాలో సమంత నటనకి మంచి మార్కులు పడ్డాయి. ఈ చిత్రం విడుదలై నేటికి మూడేళ్లు అవుతుంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన విశేషాలు నెమరవేసుకుంటున్నారు.
2010లో ఏమాయ చేశావే సినిమాతో తెలుగు పరిశ్రమకు పరిచయమైనన సమంత.. తెలుగు-తమిళ్ భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు పొందింది ఈ ముద్దుగుమ్మ. రీసెంట్గా ‘శాకుంతలం’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసింది. గుణశేఖర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందింది. మరోవైపు విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉంది ఇటీవల ఫ్యామిలీ మెన్-2 వెబ్ సిరీస్‌లో కూడా సమంత అదరగొట్టిన విషయం తెలిసిందే.