హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఓటర్ల జాబి తా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)లో భా గంగా నోటీసుల జారీ ప్రక్రియలో ఒక నోటీసు మాత్రమే పెండింగ్లో ఉన్నది. మొత్తం 92,88,181 మందికి నోటీసులు జారీ చే యాల్సి ఉండగా.. ఇప్పటివరకు 92,88,180 నోటీసులను ఎన్నికల సం ఘం జనరేట్ చేసింది. పెండింగ్లో ఉన్న చివరి నోటీసు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓటరుకు సంబంధించినదిగా తెలంగాణ సీఈవో కార్యాలయ వర్గాలు తెలిపాయి. జ నరేట్ చేసిన నోటీసుల్లో బుధవారం వరకు 88,96,846 అందజేశారు. ఇప్పటి వరకు తుది ఓటర్ల జాబితాలో అర్హులుగా 51,86,777 మందిని అధికారులు గుర్తించారు. అక్టోబర్ 7వరకు అభ్యంతరాలు, క్లె యిమ్లు స్వీకరించనున్నారు. నవంబర్ 9 న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.