అక్కినేని నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత మౌనంగా ఉంది. ఈ మధ్య తనకి సంబంధించి ఎన్నో అబద్దపు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అవన్నీ రూమర్స్ చెబుతూ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే శాకుంతలం చిత్ర షూటింగ్ పూర్తి చేసిన సామ్ తమిళ చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉంది. రీసెంట్గా ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంకి కూడా హాజరైంది.
సమంత చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంతకు బాలీవుడ్ ఆఫర్స్ బాగా వస్తున్నాయట. ఇందులో భాగంగా తనకు వచ్చిన క్రేజీ ఆఫర్‌ని సమంత యాక్సెప్ట్ చేసిందనే ప్రచారం నడుస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రానుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాలు మొదలైతే, మనసును ఆ వైపు మళ్లించవచ్చని ఆమె భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.