Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఈ మధ్య సినిమాల కన్నా సోషల్ మీడియా పోస్ట్‌లతోనే వార్తలలో నిలుస్తుంది. తాజాగా తన సోషల్ మీడియాలో శరీరాకృతి గురించి తప్పుడు కామెంట్స్ చేసిన వారికి గట్టిగా బదులిచ్చింది సామ్. తనని విమర్శించే వారికి ఫిట్ నెస్ సవాల్ విసురుతూ తాను జిమ్ లో చేస్తున్న పుల్ అప్స్ వీడియోని పంచుకుంది. నా గురించి తప్పుడు కామెంట్స్ చేసే వారు మూడు పుల్-అప్స్ తీసి చూపించాలని, అలా చేయలేని పక్షంలో తన గురించి మాట్లాడటం మానేయాలంటూ కాస్త ఘాటుగానే బదులిచ్చింది సమంత.
ఇటీవల సమంత అవార్డ్‌ల వేడుకకి హాజరు కాగా, ఆ కార్యక్రమానికి శ్రీలీల కూడా హాజరైంది. అయితే ఆ సమయంలో సమంత, శ్రీలీల ఇద్దరు కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాని షేక్ చేశాయి. అయితే ఇందులో సమంత లుక్ కొందరిలో అనేక అనుమానాలు కలిగించాయి. అనారోగ్యం వలన సమంత బాగా సన్నబడ్డారని కొందరు కామెంట్లు చేశారు. ఈ క్రమంలో తన లుక్స్‌పై వస్తున్న విమర్శలకు సమాధానంగా సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అందులో సామ్ జిమ్‌లో పుల్ అప్స్ చేయడం మనం గమనించవచ్చు.
అయితే తన పోస్ట్‌కి ఓ ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించింది సమంత. మనం ఒక డీల్ చేసుకుందాం. ‘సన్నబడ్డావు’, ‘ఆరోగ్యం బాలేదా?’ లాంటి చెత్త కామెంట్స్ ఎవరైతే చేస్తున్నారో , మీరు కనీసం మూడు పుల్-అప్స్ చేయగలగాలి. ఒకవేళ మీరు ఆ పని చేయలేకపోతే, దయచేసి నా గురించి మాట్లాడడం మానేస్తే మంచిది అంటూ సమంత పేర్కొంది. ఇక కొంతకాలంగా సమంత మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో పోరాడుతున్న విషయం మనందరికి తెలిసిందే. 2022లో తాను ఈ వ్యాధి బారిన పడినట్లు చెప్పుకొచ్చిన ఈ భామ అప్పటి నుంచి ప్రత్యేక చికిత్స తీసుకుంటూనే, ఫిట్‌నెస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. ఇటీవల సమంత నిర్మించిన ‘శుభం’ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది.