మలయాళ నటుడు మమ్ముట్టి ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. 72 ఏండ్ల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ.. కుర్ర హీరోలకు కాంపీటిషన్గా నిలుస్తున్నాడు. ఈ ఏడాది మమ్ముట్టి నటించిన భ్రమయుగం, టర్బో చిత్రాలు సూపర్ హిట్‌ను అందుకున్నాయి. అయితే ఈ మెగాస్టార్ ప్రస్తుతం తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్‌తో ఓ చిత్రం చేయబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌కు సంబంధించి ఒక సాలిడ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ప్రాజెక్ట్‌లో కథానాయికగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రం 2024 ఎండింగ్లో విడుదల కానున్నట్లు తెలుస్తుంది.
ఇక గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత అతని డైరెక్షన్లోనే ఎటో వెళ్లిపోయింది మనసు సినిమా చేసింది. ఇక ఈ సినిమా సామ్ ఒకే అంటే గౌతమ్ మీనన్‌తో హ్యాట్రిక్ చిత్రం కాబోతుంది. మరోవైపు సామ్ కొన్ని రోజులుగా సినిమాలకు దూరంగా విషయం తెలిసిందే. తన చివరి తెలుగు చిత్రం విజయ్ దేవరకొండతో నటించిన ఖుషి. మయోసైటిస్‌తో భాదపడుతున్న సామ్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.