Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల సినిమాల కన్నా ఇతర విషయాలతో ఎక్కువగా వార్తలలో నిలుస్తుంది. తాజాగా ఆమె ఫాలో అవుతున్న స్ట్రిక్ట్ డైట్ ప్లాన్‌తో హాట్ టాపిక్ అయింది. తాజాగా సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ ర్యాన్ ఫెర్నాండోతో జరిగిన చాట్ సెషన్లో సమంత తన ఆహారపు అలవాట్లు ఎంతలా మారాయో చెప్పుకొచ్చింది. సమంత ప్రస్తుతం యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలిపారు. కేవలం సన్నగా ఉండటానికే కాదు, హెల్దీగా ఉండటానికి ఈ డైట్ ఎంతో ఉపయోగపడుతుంది అని స్పష్టం చేశారు. గతంలో తాను సన్నగా ఉండడంతో, ఎలాంటి నియమాలు పాటించకుండా అన్ని తినొచ్చు అనుకునే దానిని. కాని ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పారు.
తన డైట్లో ప్రతి రోజు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటున్నట్టు సమంత వెల్లడించారు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌గా స్మూతీలు, బ్రోకలీ, క్యాలీఫ్లవర్, మొలకలు వంటి పోషకాహార కూరగాయలతో లంచ్, డిన్నర్ తీసుకుంటుందట. పాలకూర, కాలే తినడం ఇష్టం లేకపోవడంతో వాటికి బదులుగా పౌష్టిక విలువలు ఉన్న ఇతర ఆహార పదార్థాలను ఎంచుకుందట. సమంత ఏదైనా షూటింగ్ కోసం వెళ్లినప్పుడు తన అసిస్టెంట్‌ను కూడా వెంట తీసుకెళ్తారట. ఎందుకంటే ఆ అసిస్టెంట్ ఆమెకు స్పెషల్ డైట్‌కు అనుగుణంగా వంట చేసి పెడతారట. ఈ ఆరోగ్యకరమైన ఆహార నియమాలు పాటించడం వలన తాను ఎదుర్కొన్న కొన్ని ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి ఎంతో సహాయపడ్డాయని కూడా సమంత వెల్లడించారు.
సమంత ఇటీవలే సిటాడెల్ అనే వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సిరీస్‌కు మంచి స్పందన లభించింది. అంతేకాకుండా నిర్మాతగా మారి ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే బ్యానర్‌ను ప్రారంభించి, శుభం అనే సినిమాతో నిర్మాణంలో విజయవంతమయ్యారు. ప్రస్తుతం మా ఇంటి బంగారం అనే సినిమాను తన సొంత బ్యానర్లో చేస్తుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్‌లోనూ రక్త్ బ్రహ్మాండ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు.