రెండేళ్ల క్రితం వచ్చిన ‘ఖుషి’ తర్వాత మళ్లీ తెలుగులో హీరోయిన్గా కనిపించలేదు సమంత. ఈ మధ్య తన ఫోకస్ అంతా బాలీవుడ్పైనే. రాజ్.డి.కె.తో కలిసి వెబ్ సిరీస్లు చేస్తూ బిజీబిజీగా ఉంది సామ్. రీసెంట్గా తెలుగులో ‘శుభం’ అనే హారర్ కామెడీ సినిమా నిర్మించి మంచి లాభాలనే గడించింది. ఏదేమైనా.. తెలుగు తెరపై సమంత సాక్షాత్కారం కోసం ఆమె అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నమాట నిజం. అందుకే.. త్వరలో తెలుగులో ఓ సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నారట సామ్.
తన సొంత నిర్మాణ సంస్థ ‘ట్రాలాలా’ పతాకంపై ‘మా ఇంటి మహాలక్ష్మి’ పేరుతో ఓ సినిమాను గతంలో సమంత ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. ఆ తర్వాత ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేటూ లేదు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమానే సామ్ త్వరలో మొదలుపెట్టనున్నారట. సామ్ స్నేహితురాలైన నందినీరెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని సమాచారం. గతంలో నందినీరెడ్డి దర్శకత్వంలో సమంత రెండు సినిమాలు చేశారు.
వాటిలో ఒకటైన ‘జబర్దస్త్’ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండో సినిమా ‘ఓ బేబీ’ పెద్ద హిట్. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. 1980 నేపథ్యంలోసాగే క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా ఉంటుందట. వయోలెంట్ జానర్లో రూపొందనున్న ఈ సినిమాను సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పూర్తి చేసి, వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయాలని సామ్ భావిస్తున్నారట.