సినిమాల్లో, బయటా ఉత్సాహాన్ని ప్రదర్శించే స్టార్ హీరోయిన్ సమంతలో మునుపటి సంతోషం కనిపించడం లేదు. మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన ఆమె చికిత్స తీసుకుంటున్నది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన సమంత ఇప్పుడు మళ్లీ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పోస్టులు చేస్తున్నది. తాజాగా ఆమె తన పెంపుడు కుక్క పిల్లలు హ్యాష్, పాషాలతో ఉన్న ఓ ఫొటోను షేర్ చేసింది. ‘అమ్మా బాధపడకు నీకు అండగా నేనున్నా..’ అంటూ క్యాప్షన్ రాసింది. పెంపుడు కుక్క పిల్లలు తనకు ధైర్యం చెబుతున్నట్లు అర్థం వచ్చేలా ఉందీ పోస్ట్. సమంత సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతున్నది. ఇటీవల సమంత తన కొత్త సినిమా ‘శాకుంతలం’ ప్రమోషన్ లో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె కంటతడి పెట్టడం సినీ ప్రియులను భావోద్వేగానికి గురిచేసింది. ప్రస్తుతం సమంత ‘ఖుషి’ సినిమాతో పాటు ‘సిటాడెల్’ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నది.