సమంత మానసికంగా చాలా స్ట్రాంగ్. అటు వైవాహిక జీవితం విఫలమైనా, ఇటు మయోసైటిస్ వల్ల శారీరక బాధలు ఎదురైనా.. అభ్యంతరకర వార్తలు తనపై ట్రోల్ అయినా.. సామ్ మాత్రం ఎప్పుడూ చలించలేదు. అందుకే ఆమెను శక్తివంతమైన మహిళ అనొచ్చు. నాగచైతన్య, శోభితా ధూళిపాళల వివాహ వార్త వచ్చినప్పట్నుంచీ సమంతపై సోషల్‌మీడియా కాన్సన్ట్రేషన్ కాస్త ఎక్కువైంది. ఆమెపై నెగెటివ్ పోస్టులు పెడుతున్న వాళ్లు కొందరైతే, ఆమెపై పాజిటీవ్‌గా స్పందిస్తున్న వాళ్లు కొందరు.
వీటన్నింటికీ సమాధానాన్నిస్తున్నట్టు రీసెంట్గా తన ఇన్‌స్టాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది సమంత. ‘శాంతి, నిశ్శబ్ద మ్యూజియం’ అనే కొటేషన్ వున్న టీషర్ట్ ధరించిన ఆమె.. తాను శాంతితో కూడిన నిశ్శబ్ద మ్యూజియం లాంటి దాన్ననీ.. అనవసర రూమర్స్ ఎన్ని వచ్చినా ప్రశాంతంగా ఉండటం తన నైజమని చెబుతూ, గాగుల్స్‌తో గర్వంగా నవ్వుతున్న ఫొటో షేర్ చేసింది సమంత. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో బాగా వైరల్ అవుతున్నది.