Samantha | నాగచైతన్య, సమంత జంట ప్రేమలోపడి పెళ్లి చేసుకున్నారు. ఏవో కారణాలతో రెండేళ్ల కిందట విడిపోయారు. అయితే, ఇప్పటి వరకు విడాకులపై స్పందించలేదు. వీరిద్దరి విడాకుల నిర్ణయం సినీ అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది. వీరిద్దరూ ఒకరు ఎలాంటి విమర్శలు చేసుకోలేదు. తాజాగా నాగచైతన్య మరోసారి పెళ్లికి సిద్ధమయ్యాడు. నటి శోభితా ధూళిపాలను త్వరలోనే వివాహం చేసుకోనున్నాడు. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇక సమంత సినిమాల్లో ఫుల్ బిజీగా ఉన్నది. ప్రస్తుతం హిందీలో ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌లో అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అడిగిన ప్రశ్నలకు సమంత ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఖరీదైన గిఫ్ట్‌ని ఎవరికైనా ఇచ్చారా? ఆ గిఫ్ట్ వేస్ట్ అయిందా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటూ ప్రశ్నించాడు. దీనికి సమంత స్పందిస్తూ నా ఎక్స్‌కి ఇచ్చిన గిఫ్ట్ అంటూ స్పందించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
నాగచైతన్య, నటి శోభిత పెళ్లి వేడుక డిసెంబర్ 4వ హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగనున్నది. ఇప్పటికే పెళ్లి పనులు జోరు అందుకున్నాయి. వివాహం సింపుల్‌గా జరుగుతుందని.. చైతూ కోరిక మేరకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సినీ ప్రముఖులు 300 మందిని మాత్రమే ఈ వివాహ వేడుకకు ఆహ్వానించాలని నిర్ణయించారు. స్టూడియోలో వేసిన అందమైన సెట్లో ఈ జంట పెళ్లితో ఏకం కాబోతుందని నాగార్జున తెలిపారు. పెళ్లి పనులు చైతు, శోభిత చూసుకుంటున్నారని.. పెళ్లికి వివాహానికి అన్నపూర్ణ స్టూడియోస్ వేదిక కావడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఇది కేవలం స్టూడియో మాత్రమే కాదని.. తమ కుటుంబ వారసత్వంలో ఓ భాగమని పేర్కొన్నారు.