ఇటీవల మయోసైటిస్ అనే ఆటోఇమ్యూన్ వ్యాధి బారిన పడిన సమంత పరిస్థితిని అర్థం చేసుకోలగను అని చెప్పింది యువ తార పియా బాజ్బాయ్. ఎందుకంటే గతంలో ఆమె కూడా మయోసైటిస్ బారిన పడింది. పియా బాజ్పాయ్ మాట్లాడుతూ…‘చికిత్స లేని రోగం వచ్చిందని తెలిస్తే మానసిక స్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.
నా విషయం ఇంట్లో వాళ్లకు చెప్పలేదు. ముంబైలో ఉంటూ చికిత్స తీసుకున్నా. సమంతకు ఈ వ్యాధి సోకిందని తెలిసి బాధపడ్డా. ఆమె పరిస్థితిని అర్థం చేసుకోగలను’ అని చెప్పింది.