మయోసైటిస్ వ్యాధి వేధిస్తున్నా నిరాశకు లోనుకాకుండా షూటింగ్స్‌కు హాజరవుతున్నది స్టార్ హీరోయిన్ సమంత. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో ‘సిటాడెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నది. అమెరికన్ యాక్షన్ టీవీ సిరీస్‌కు హిందీ రీమేక్‌గా ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు దర్శకద్వయం రాజ్ డీకే. ఈ సినిమాలో పోరాట ఘట్టాలకు అధిక ప్రాధాన్యత ఉంది. వీటి రూపకల్పనలో పాల్గొంటున్న సమంత గాయపడింది. ఆమె చేతికి అయిన గాయాలను చూపుతూ ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఈ ఫొటోకు సినీ ప్రియులు స్పందిస్తూ…నటన పట్ల ఆమెకున్న అంకితభావాన్ని ప్రశంసిస్తున్నారు. ఇటీవల నైనిటాల్లో 8 డిగ్రీల ఉష్ణోగ్రతలో సమంత బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఈ నాయిక నటించిన ‘శాకుంతలం’ సినిమా ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధమవుతున్నది. ఆమె ఖాతాలో ‘ఖుషీ’ అనే మరో సినిమా ఉంది.