Samantha- Raj | స్టార్ హీరోయిన్ సమంత ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఇటీవల ఆమె పేరు బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరు తో లింక్ అవుతుండటం పెద్ద చర్చగా మారింది. ఇద్దరూ తరచూ కలిసి కనిపించడం, వెకేషన్స్‌కు వెళ్లడం, రెస్టారెంట్లలో డిన్నర్స్ చేయడం, ఒకే కారులో ప్రయాణించడం, జిమ్ సెషన్స్‌లో కలిసి వర్కవుట్ చేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా ముంబై బాంద్రాలోని ఓ జిమ్ నుంచి సమంత, రాజ్ కలిసి బయటకు రావడం మళ్లీ ఈ చర్చలకు ఊతమిచ్చింది.
ఇద్దరూ లైట్ పింక్ డ్రెస్స్‌లో కనిపించగా, తర్వాత ఒకే కారులో వెళ్లిపోవడం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నెటిజన్లు, అభిమానులు “ఎప్పటి వరకు సైలెంట్‌గా ఉంటారు.. క్లారిటీ ఇవ్వాలి కదా” అంటూ సమంతను ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సామ్ గానీ, రాజ్ గానీ ఏ విధమైన స్పందన లేదు. మరోవైపు రాజ్ వ్యక్తిగత జీవితం కూడా చర్చనీయాంశమే. ఆయనకు ఇప్పటికే శ్యామాలి తో వివాహం కాగా, ఒక కుమార్తె కూడా ఉంది. కొద్ది రోజుల క్రితం రాజ్-శ్యామాలి విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వెలువడ్డాయి. కానీ ఇద్దరూ ఆ విషయంపై ఏమీ మాట్లాడలేదు.
అయితే శ్యామాలి మాత్రం సోషల్ మీడియాలో సందేశాత్మక పోస్టులతో ఆసక్తి రేపుతున్నారు. రీసెంట్గా ఆమె చేసిన “నమ్మకం, విశ్వాసం” వంటి కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. మొత్తానికి సమంత – రాజ్ వ్యవహారం సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ రూమర్స్‌పై వారిద్దరూ ఎప్పుడు స్పందిస్తారో చూడాలి. ఇక సమంత ఇటీవలి కాలంలో పెద్దగా సినిమాలు చేయడం లేదు. అడపాదడపా సోషల్ మీడియాలో మాత్రమే సందడి చేస్తుంది. మరోవైపు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటుంది.
Queen @Samanthaprabhu2 💛#SamanthaRuthPrabhu𓃵#Samantha #SamanthaRuthPrabhu pic.twitter.com/PlDCMUqD4Q
— Samcults (@Samcults) September 23, 2025