Samantha | మయోసైటిస్ వ్యాధి చికిత్స కోసం కథానాయిక సమంత తెలుగులో ఓ అగ్ర హీరో వద్ద 25 కోట్లు అప్పుగా తీసుకుందని కొద్దిరోజులుగా సోషల్మీడియాలో వార్తలొస్తున్నాయి. వీటిపై సమంత ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. ఆమె మాట్లాడుతూ ‘మయోసైటిస్ ట్రీట్మెంట్కు 25కోట్లా? ఎవరో మీరు తప్పుడు లెక్కలు చెప్పారు.
చికిత్సకు తక్కువ మొత్తంలోనే డబ్బులు అవసరమవుతాయి. ఇప్పటి దాక నేను పని చేసిన సినిమాలకు రాళ్లురప్పలను పారితోషికంగా తీసుకోలేదనుకుంటున్నా. నా బాగోగులను నేనే చూసుకుంటా’ అంటూ పుకార్లపై వ్యంగ్యంగా స్పందించింది. మయోసైటిస్ చికిత్స కోసం సమంత సినిమాలకు కాస్త బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఆమెరికాలో చికిత్స తీసుకునే ఆలోచనలో సమంత ఉందని చెబుతున్నారు.ఈ భామ కథానాయికగా నటించిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.