
అగ్ర కథానాయిక సమంత మరో ప్రేమకథా చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నది. డ్రీమ్ వారియర్ ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా శంతరుబన్ జ్ఞానశేఖరన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కించబోతున్నారు. ‘వినూత్న ప్రేమ కథా చిత్రమిది. టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. హీరో ఎవరనే విషయాన్ని త్వరలో తెలియజేస్తాం’ అని చిత్రబృందం తెలిపింది. ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు ఈ చిత్రానికి నిర్మాతలు. రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభకానుంది.
మహిళ ప్రధాన ఇతివృత్తంతో
సమంత కథానాయికగా శ్రీదేవి మూవీస్ పతాకంపై ఓ ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నది. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాత. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ నవంబర్‌లో ప్రారంభంకానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘మహిళా ప్రధాన ఇతివృత్తంతో రూపుదిద్దుకోనున్న చిత్రమిది. కథ కథనాలు విభిన్నంగా ఉంటాయి’ అని తెలిపారు.