అగ్ర హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా సైన్స్ ఫిక్షన్ మూవీ 2027లో విడుదల కావొచ్చని ఓ అంచనా. ఓ వైపు ఈ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే, మరోవైపు నెక్ట్స్ సినిమా కోసం కథలు వింటున్నారు అల్లు అర్జున్. ఈ క్రమంలోనే బాలీవుడ్ అగ్ర దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ కథ కూడా విన్నారట. ‘పుష్ప 2’ సమయంలోనే వీరిద్దరి మధ్య చర్చలు జరిగాయట.
ఇన్నాళ్లు కథపై కసరత్తులు చేసిన భన్సాలీ.. కథ సంతృప్తిగా రావడంతో రీసెంట్గా బన్నీకి వినిపించారట. బాలీవుడ్ సమాచారం ప్రకారం బన్నీ కూడా కథ విషయంలో పాజిటివ్‌గానే స్పందించారని వినికిడి. అయితే.. ఈ సినిమా సెట్స్‌కి వెళ్లడానికి ఖచ్చితంగా రెండేళ్లకు పైనే పడుతుందని అంటున్నారు. అంత సమయం అంటే.. ఈ లోపు ‘పుష్ప 3’తో సుకుమార్ కలవొచ్చు, ‘సరైనోడు 2’ తీసుకొని బోయపాటి వెళ్లొచ్చు. ఇక ప్రశాంత్ నీల్ ఎలాగూ ఉన్నాడు. మరి ఏమవుతుందో చూడాలి.