టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తున్నది. క్లాస్, మాస్ అనే తేడా లేకుండా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన స్పందన వస్తున్నది. అయితే ఈ ఆనందాన్ని పంచుకోవడానికి చిత్రబృందం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో సమంత భర్త రాజ్ నిడిమోరు పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ‘మేము హిందీలో ఎన్నో ప్రాజెక్టులు చేశాం. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్, ‘స్త్రీ’ సినిమాలు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. ప్రతి ఒకరూ వాటి గురించే మాట్లాడుకున్నారు. కానీ ఆ సినిమాల కంటే ‘మా ఇంటి బంగారం’ చిత్రానికే నాకు అత్యంత అద్భుతమైన ప్రశంసలు దకాయి. అందుకే ఈ సినిమా నా గుండెకు బాగా దగ్గరైంది.
ఇకడి ప్రేక్షకులు చూపించిన ఆదరణ నన్ను ఎంతగానో కదిలించింది’ అని ఆయన ఆనందం వ్యక్తం చేశాడు. స్వతంత్రంగా సినిమాలు నిర్మించడంలో ఉండే సవాళ్లను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటూ.. గతంలో తాము నిర్మించిన ‘స్త్రీ’ సినిమాకు ప్రారంభంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ ముందుకు రాలేదని, ఆ సినిమా భవిష్యత్తుపై అప్పట్లో ఎన్నో అంచనాలు, అనుమానాలు ఉండేవని చెప్పుకొస్తూ.. సరిగ్గా అదే రకమైన ఇబ్బందులు ‘మా ఇంటి బంగారం’ చిత్రానికీ ఎదురయ్యాయని వివరించాడు. ‘ఈ సినిమా అనౌన్స్ చేయగానే ఇన్వెస్టర్లు ఎవరూ మా వెనుక పరిగెత్తుకుంటూ రాలేదు.
ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ బిజినెస్ ఎలా జరుగుతుందో అనే ఆందోళన మాలో ఉండేది. సినిమాను డిజైన్ చేస్తున్నప్పుడే సమంతలోని పూర్తి నటనను, యాక్షన్ సిల్స్ ను వాడుకుని సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాలని అనుకున్నాం. కానీ, బడ్జెట్ పరిమితులు, తకువ సమయం వంటి సవాళ్లు ఎదురయ్యాయి’ అని రాజ్ నిడిమోరు తెలిపాడు. ఆ సమయంలో సమంత వ్యక్తిగత జీవితం, ఆరోగ్యంపై బయట ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయని, నిజానికి ఆమె ఇక సినిమాలు చేయకూడదని అనుకుంటే తానే బలవంతం చేసి కనీసం ఈ ఒక సినిమా అయినా చేయమని ఒప్పించినట్లు ఆనాటి పరిస్థితులను వివరించాడు రాజ్.