Samantha | ‘ఒంటరితనం విలువైనది. మనతో మనం మాట్లాడుకునే అవకాశం ఒంటరితనం వల్లే లభిస్తుంది. మానసిక ఇబ్బందులతో బాధపడుతున్న వాళ్లకు ఒంటరితనాన్ని మించిన మందు లేదు.’ అని చెప్పుకొచ్చింది అందాలభామ సమంత. తనకు మనసు బాగుండకపోతే వెంటనే తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో వాలిపోతుంది సమంత. అక్కడ ధ్యానం, యోగ సాధనతో ఆమె ఉపశమనం పొందుతూ ఉంటుంది. సద్గురు వద్ద సాధన చేస్తూ తాను దిగిన ఫొటోలు, వీడియోలను సోషల్‌మీడియాలో షేర్ చేసింది సమంత.
ఈ సందర్భంగా ఆమె ఇంకా మాట్లాడుతూ ‘మనుషులు ఒంటరిగా ఉండటం అంటే ఈ రోజుల్లో కష్టం. చేతిలో ఫోన్ ఉంటే ప్రపంచం మనతో ఉన్నట్టే. ఫోన్ చూస్తూ కూర్చోవడం కూడా ఒంటరితనం అవ్వదు. నిజంగా మానసిక ఒత్తిడి నుంచి బయటపడాలనుకునేవారికి నా సలహా ఒక్కటే. ముందు మీ చేతిలో ఉన్న ఫోన్ తీసి అవతల పారేయండి. కమ్యూనికేషన్‌కి దూరంగా ఉండండి. నీకు నువ్వే తోడవ్వాలి. అలా ఒక్కరోజు ఉండి చూడు. మనశ్శాంతి అంటే ఏంటో తెలుస్తుంది.’ అని పేర్కొన్నది సమంత.