Samantha | ఈ మధ్య సమంత తరచు వార్తలలో నిలుస్తుంది. నాగ చైతన్య నుండి విడిపోయిన తర్వాత దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుందని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇద్దరు కలిసే ఉంటున్నారని, కలిసే తిరుగుతున్నారని, త్వరలో వివాహం కూడా చేసుకోనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో రాజ్ సతీమణి శ్యామాలి సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్లు పెడుతుంది. రీసెంట్గా నమ్మకం ఎంతో ఖరీదైన డబ్బు వంటిది, ఒక్కసారి దానిని పొగొట్టుకుంటే తిరిగి సంపాదించలేం అంటూ కోటేషన్లు షేర్ చేసింది.
ఇక తాజాగా సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ఎవరి మాటలు పట్టించుకోకుండా నిబ్బరంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఎవరేమి చెప్పినా, అది మన ప్రశాంతతను భంగం చేయకూడదు. శాంతిని అనుభవించడానికి నిరంతరం ప్రయత్నించాలి, కానీ దానితో పోరాడకండి.. ‘నేను చేయాల్సింది’ అనే భావనను ‘నేను తప్పకుండా చేయాల్సిందే’ అనుకుంటే, అది మనకు మరింత ఒత్తిడి కలిగించవచ్చు. మనసు వేగంతో కాకుండా, నిశ్చలంగా ప్రశాంతతను పొందుతుంది. మనం పెట్టుకునే సరిహద్దులు మన ఆత్మగౌరవానికి ఒక భాగమే, కానీ వాటి ద్వారా ఒత్తిళ్లు గౌరవానికి అవరోధంగా మారకూడదు. మన శక్తిని తీసుకోవడానికి ఎవరూ అర్హులు కాదు అని ఆమె రాసుకొచ్చారు. అకస్మాత్తుగా సమంత ఈ విధమైన తాత్విక ధోరణిలో ఎందుకు మాట్లాడుతుందో అర్ధం కావడం లేదు.
ఇదిలా ఉంటే సమంత ఇప్పటికే రాజ్ డైరెక్షన్లో ఫ్యామిలీ మ్యాన్ 2 పార్ట్ 1, పార్ట్ 3లతో పాటు, ఆ మధ్య వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వంటి సిరీస్లలో నటించి మెప్పించింది.. ఇటీవల సమంత నిర్మాతగా మారి చేసిన శుభం సినిమాకు నిర్మాతల్లో ఒకడిగా రాజ్ వ్యవహరించడం గమనార్హం. ఇదే కాకుండా రాజ్ నిర్మిస్తూ డైరెక్ట్ చేస్తున్న రక్త్బ్రహ్మండ్ వెబ్ సిరీస్లో సమంత కథానాయుకగా నటిస్తోంది.