Samantha | దక్షిణాదిలో తిరుగులేని స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లతో నార్త్ ఇండియాలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె, నిత్యం ఏదో ఒక అంశంతో హెడ్లైన్లలో నిలుస్తుంటారు. 2010లో ఏమాయ చేశావే సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సమంత, అదే సినిమాలో నటించిన నాగ చైతన్యతో కొన్నేళ్లు డేటింగ్లో ఉండి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ ఈ దంపతులు కొద్దికాలానికే విడిపోయారు. వారి విడాకులు ఇండస్ట్రీని షాక్‌కి గురిచేశాయి.
ఆ సమయంలో డిప్రెషన్‌తో పోరాడిన సమంత, మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడి, కొన్ని రోజులపాటు సినిమాలకి కూడా విరామం తీసుకుంది. అయితే సమంత సమంత తాను కమిటైన శాకుంతలం, ఖుషి వంటి చిత్రాలను చికిత్స తీసుకుంటూనే పూర్తి చేసింది. ఈ సినిమాలు ఆశించిన విజయం సాధించకపోవడంతో, బాలీవుడ్ వెబ్‌సిరీస్‌లపై దృష్టి సారించారు. ది ఫ్యామిలీ మ్యాన్, సిటాడెల్ వంటి వెబ్‌సిరీస్‌ల ద్వారా హిందీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న సమంత, ఈ ప్రాజెక్టుల సమయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సన్నిహితంగా మారిందన్న వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవల ఈ ఇద్దరు జంటగా కనిపిస్తుండడం అందరిలో అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి.
అయితే అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 24వ ద్వైవార్షిక మహాసభలకు సమంతను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న సమంత.. తానా సభల్లో పాల్గొనడం నాకు 15 ఏళ్ల కల. మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు నన్ను మీలో ఒకరిగా చూస్తున్నారు. మీరు ఇచ్చిన ప్రేమ, గుర్తింపు, కుటుంబం కోసం ఎప్పటికీ కృతజ్ఞురాలిని అని ఎంతో భావోద్వేగంతో మాట్లాడిన సమంత స్టేజ్ మీద కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ సమయంలో పక్కనే ఉన్న సుమ ఆమెని హత్తుకుని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.