శనివారం 29 ఫిబ్రవరి 2020
స‌మంత‌కి మ‌రో డూప్‌.. ఫోటోలు వైర‌ల్‌

స‌మంత‌కి మ‌రో డూప్‌.. ఫోటోలు వైర‌ల్‌

Feb 14, 2020 , 08:33:16
PRINT
స‌మంత‌కి మ‌రో డూప్‌.. ఫోటోలు వైర‌ల్‌

మ‌నిషిని పోలిన‌ మ‌నుషులు ఉంటార‌నే సంగ‌తి  మ‌నంద‌రికి తెలిసిందే. ప్ర‌పంచం మొత్తంలో మ‌న‌లాంటి వారు ఏడుగురు ఉంటార‌ని చిన్న‌ప్ప‌టి చెబుతుండ‌డం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. అయితే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌ల‌లో ఒక‌రిగా ఉన్న స‌మంత మాదిరి అషూ రెడ్డి ఉంద‌ని అప్ప‌ట్లో తెగ వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. స‌మంత డూప్‌గా ప్రాచుర్యం పొందిన ఈ అమ్మ‌డు బిగ్ బాస్ సీజ‌న్ 3కి కూడా ఎంపికైంది. ఇక ఇప్పుడు త‌మిళ ప‌రిశ్ర‌మ‌కి చెందిన వ‌ర్ధ‌మాన న‌టి ఆత్మిక కూడా స‌మంత‌లానే ఉంద‌ని అంటున్నారు. ఓ ఫోటో షూట్‌లో పాల్గొన్న ఈ అమ్మ‌డి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో అచ్చం స‌మంత‌లానే ఉంది కదా అని కామెంట్ పెడుతున్నారు.  కాగా, స‌మంత రీసెంట్‌గా జాను సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా త్వ‌ర‌లో విజ‌య్ సేతుప‌తితో క‌లిసి సినిమా చేయ‌నున్న‌ట్టు తెలుస్తుంది. 


logo