Samantha defamation case | నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత తన వ్యక్తిగత జీవితానికి భంగం వాటిల్లేలా.. పలు యూట్యూబ్ ఛానల్స్ ఇష్టం వచ్చినట్లు తన గురించి తప్పుడు వార్తలు ప్రసారం చేశాయని టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈమెకు కూకట్పల్లి హై కోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్ (సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె పరువు నష్టం దావా వేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యూ ట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ ఇంజెక్షన్ ఆర్డర్‌ను జారీ చేసింది.
ఇప్పుడు మాత్రమే కాదు.. ఇకపై కూడా ఎప్పుడూ సమంత వ్యక్తిగత, కుటుంబ విషయాల జోలికి యూట్యూబ్ ఛానల్స్ వెళ్లకూడదు అని గట్టిగా చెప్పింది న్యాయస్థానం. అంతే కాదు కేవలం సమంత విషయంలోనే కాకుండా మిగిలిన వాళ్ల విషయంలో కూడా వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడటం లాంటివి చేయకూడదు అని కోర్టు వార్నింగ్ ఇచ్చింది. తమ వ్యూస్ కోసం, పబ్లిసిటీ కోసం ఇష్టం వచ్చినట్లు కంటెంట్ పెడితే కచ్చితంగా చర్యలు తప్పవు అంటూ హెచ్చరించింది న్యాయస్థానం. సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు.
నాగ చైతన్య, సమంత విడాకుల ప్రకటనను అధికారికంగా వెల్లడించిన తర్వాత సోషల్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ విడాకుల విషయంలో సమంత ది తప్పు అని.. ఆమె పిల్లలు వద్దనుకుందని కొందరు.. హెయిర్ స్టైలిస్ట్ జుకల్కర్, సమంత మధ్య ఎఫైర్ నడుస్తోందని మరికొందరు.. ఇలా ఎన్నో రకాల వార్తలు మాజీ అక్కినేని కోడలిపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని సీరియస్ గా తీసుకున్న సమంత పరువు నష్టం దావా వేసింది తాజాగా కోర్టు ఈ విషయంలో సమంతకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
విడాకుల తర్వాత భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్న సమంత.. కల నెరవేరిందంటూ వేదాంతం
సమంత తీర్థయాత్రల వెనక అసలు కారణం ఏంటి..?
Samantha : సమంత- చైతూ పోటీ పడి సినిమాలు చేస్తున్నారుగా..!
Samantha : నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..